ETV Bharat / city

సెల్ఫీ ప్లీజ్​ అన్నారు..మంత్రిగారి కడియం కొట్టేశారు! - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కడియం దొంగతనం

సెల్ఫీల కాలం నడుస్తోంది. వీఐపీలకు ఈ తాకిడి మరీ ఎక్కువ. అభిమానులు సెల్ఫీలు అడగడం... సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం... ఓ సెల్ఫీనే కదా పంపేయ్ అనడం ప్రజాప్రతినిధులకు అలవాటే! అయితే.. అలా సెల్ఫీ సమయంలోనే తెలంగాణ మంత్రి గారి చేతి కడియమే కొట్టాశాడో ఘరానా దొంగ! అదెలా జరిగిందో చదివేద్దామా...

minister-srinivas-goud-lost-his-hand-bracelet-in-devarakadra

author img

By

Published : Feb 14, 2020, 10:55 AM IST

తెలంగాణలోని మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలో ఓ పెళ్లికి వెళ్లాడు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్​ గౌడ్. బంధువుల వివాహమే కావడం వల్ల అందరితో సరదాగా గడిపారు. అంతలోనే కొంతమంది యువకులు వచ్చి సెల్ఫీ కావాలని అడిగారు. మంత్రి కాదనలేక సరేన్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ... సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే.. చేతికి కడియం లేదు. ఈ ఆభరణం మంత్రి గారి సెంటిమెంటు అన్నది ఆయన అనుచరుల చెప్పేమాట. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, అంగరంగక్షులు మాట పడాల్సి వచ్చింది. ఏం చేస్తారో తెలియదు... ఆ కడియం కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. బిత్తరపోయిన పోలీసులు 'బాబ్బాబూ! ఎవరైనా తీసుకుంటే ఇచ్చేయండి మిమ్మల్ని ఏమీ అనం' అంటూ అక్కడకు వచ్చిన వారిని బతిమాలుకోవడం మొదలుపెట్టారు.

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం మాయం

ఇవీ చూడండి: నెల్లూరు జిల్లాలో ఆలయ రథానికి నిప్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.