రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు సహా కొత్త రోడ్లను నిర్మించనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు. రాష్ట్రంలో 3100 కిలోమీటర్ల రహదారులు, 480 వంతెనలు అభివృద్ది చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాల నుంచి మండలాలు, రెండు మండల కేంద్రాల మధ్య రహదారులు, సహా వంతెనల మరమ్మతులు, నిర్మాణం కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 6400కోట్ల కోసం న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ తో రుణం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రోడ్ల కోసం 1158 కోట్లు నాబార్డ్ ఇన్ ఫ్రాస్ట్క్చర్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రుణం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రోడ్లన్నింటికీ మహర్దశ పట్టిస్తామన్న మంత్రి.. రాబోయే 4ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న రోడ్ల నిర్మాణాలన్నింటినీ పూర్తి చేస్తామన్నారు.
13 జిల్లాల్లో రెండు దశల్లో మొత్తం 26 ప్యాకేజీలుగా రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. 2,978 కోట్లతో 13 జిల్లాలో 1,243 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం తొలిదశ పనులు చేపడుతున్నామన్నారు. సెస్ ద్వారా వచ్చిన 2వేల కోట్లు డబ్బును రహదారుల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. ఆర్ అండ్ బీ పరిధిలోకి వచ్చే రోడ్లను సత్వరమే మరమ్మతులు, నిర్మాణం చేయాలన్న సీఎం ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: స్మిత్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 338 ఆలౌట్