ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు ఎక్కడా దారిమళ్లలేదని మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. ఏ పథకానికీ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లించలేదన్నారు. వైకాపా ప్రధాన ఓటు బ్యాంకు ఎస్సీలు, మైనార్టీలు, బీసీలే అని విశ్వరూప్ పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే వైకాపా ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
తెదేపా హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లించారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. ఎస్సీ నిధుల ఖర్చుపై తెదేపా నేతల వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలపై ఎక్కడా ఇబ్బందులు రాలేదని మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుకింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయని.. ఇక నుంచి మాన్యువల్‌గా బుకింగ్‌కు అవకాశం కల్పించాలని కోరతామని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇసుక సరఫరాలో అధికారులు విఫలం: వైకాపా ఎమ్మెల్యే