ETV Bharat / city

MINISTER PERNI NANI: బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం తెలియదు: పేర్ని నాని

మంత్రి పేర్నినాని
మంత్రి పేర్నినాని
author img

By

Published : Nov 12, 2021, 4:31 PM IST

Updated : Nov 12, 2021, 5:30 PM IST

16:28 November 12

ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. ఇటీవల నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుధ్దం కొనసాగింది. ఆ తర్వాత వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు ధర్నాలో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు.

తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు సరికాదు: పేర్ని నాని

      నిధుల కోసం కేంద్రం వద్ద జగన్​ బిచ్చం ఎత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం(minister perni nani fire on telangana leaders statements) చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో(andhra pradesh) అందరూ కలిసి హైదరాబాద్(hyderabad)​ను అభివృద్ధి చేశారని, పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా... తెలంగాణ అప్పుల పాలైందని మంత్రి విమర్శించారు. తెలంగాణ నేతల వైఖరి అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లుగా.. ఉందని ఆక్షేపించారు. 

 కేసీఆర్(telangana CM KCR) తరచూ కేంద్రం వద్దకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నిధులిస్తే కేంద్రంలో చేరే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని మంత్రి అన్నారు. బయట కాలర్ ఎగరేసి...లోపలికెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్​కు రాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 

పాడికుండ లాంటి హైదరాబాద్‌ ఉన్నా తెలంగాణ అప్పుల పాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. కేంద్ర నిధుల కోసం బిచ్చం ఎత్తుకుంటున్నామని అంటున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు తెలంగాణ నేతల వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు సరికాదు.   - పేర్ని నాని, రవాణశాఖ మంత్రి

రెండు రాష్ట్రాలనూ కలిపేద్దాం...  

గతంలో మంత్రి పేర్ని నాని నిర్వహించిన సమావేశాల్లో తెలంగాణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘ఆంధ్రాలో కొత్తగా తెరాస పార్టీ పెట్టాల్సిన పని ఏముంది? ఏపీ, తెలంగాణను కలిపేస్తూ తెలంగాణ అసెంబ్లీ(telangana assembly)లో తీర్మానం చేసి, రెండు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా! ఉమ్మడి రాష్ట్రంగా ఉందాం. అక్కడ ఇక్కడ ఒకే పార్టీ ఉంటుంది. కొత్తగా పార్టీ పెట్టే పనే ఉండదు’ అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సచివాలయంలో గురువారం మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రాలోనూ పార్టీ పెట్టమంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యానించారు కదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాలను కలిపేస్తే అంతర్జాతీయ తెరాస, జాతీయ, ప్రాంతీయ తెరాస పార్టీ అనే అంశమే తలెత్తదు. ఏపీ, తెలంగాణ కలిపేసిన తర్వాత ఎవరికి ఓటేస్తే వారు సీఎం అవుతారు. ఎక్కువ పార్టీలుంటే ఇబ్బందేమీ ఉండదు. 2013లోనే ఆంధ్రప్రదేశ్‌ను దుర్మార్గంగా విభజించొద్దని, సమైక్య రాష్ట్రం తెలుగు వారికి అవసరమని జగన్‌ చెప్పారు. ఇవాళ కేసీఆర్‌ అక్కడా ఇక్కడా పోటీ చేయాలని అందరూ కోరుతున్నారంటున్నారు. తెరాస సంక్షేమ పథకాల గురించి భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ దగ్గర ప్రస్తావిస్తే నిజాలు తెలుస్తాయి. ఊళ్లో పల్లకీల మోత.. ఇంట్లో ఈగల మోత సామెతలా ఉంది’ అని వ్యాఖ్యానించారు.  

రాజకీయ శూన్యతతో కొత్త పార్టీలు...  

తెలంగాణాలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు(minister perni nani comments on telangana politics news). అందుకే ఓ ఐపీఎస్​కు రాజీనామా చేసి మరీ పార్టీలోకి చేరారని.. మరికొన్ని పార్టీలు కూడా వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని..? మంత్రి ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు.

నదీజలాల విషయంలో మాట తప్పారు...

మరోవైపు నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట తప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు(minister perni nani comments on cm kcr news). డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమని ఎప్పుడో చెప్పామని ఉద్ఘాటించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంతదూరమో.. విజయవాడ నుంచి హైదరాబాద్ అంతే దూరమని గమనించాలన్నారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే రేవంత్ రెడ్డి వంటి వాళ్లు(minister perni nani slams reavanth reddy news).. సంచలనాల కోసం ఏ అంశంపై అయినా ట్వీట్లు చేస్తారని సెటైర్ విసిరారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 12, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.