కరోనా వల్ల అవసరమైన ఉద్యోగాలతోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామన్న మంత్రి పేర్ని నాని..మరిన్ని ఉద్యోగాల భర్తీతో ఇచ్చిన హామీలన్నీ సీఎం నెరవేరుస్తారని తెలిపారు.
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు: పేర్ని నాని
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. 350 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు టెండర్లు పిలిచామన్న మంత్రి..ఒక్కొక్క బస్సు ధర రూ.2 కోట్ల నుంచి రూ.1.75 కోట్లకు తగ్గిందన్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాకే ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆర్టీసీలో ఈ నెల 23 తర్వాత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేస్తామని మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: Atchannaidu: 'అధికారం కోసమే సీఎం జగన్ హామీలిచ్చారు'