కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో లిబర్టీ స్టీల్స్ ఆర్థిక పరిస్థితి సహకరించదని భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా... ప్రభుత్వమే చేపట్టాలా.. అనే అంశంపై చర్చిస్తున్నామని వివరించారు. కడప స్టీల్‌ప్లాంట్ విషయంలో ప్లాన్-బి అమలు చేస్తామని వెల్లడించారు.
ఏపీలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ.1000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.300 కోట్ల ప్రొత్సాహాకాలు అందించామని తెలిపారు. ఏప్రిల్ 2న ఐటీ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్న మంత్రి... వివిధ సంస్థలకు చెందిన సీఈఓలు, సీఎఫ్ఓలు వర్క్‌షాప్‌లకు హాజరవుతారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: