తెలంగాణ రాష్ట్రం సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని ఎన్కౌంటర్ చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. కచ్చితంగా ఆ నిందితున్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేస్తామని ప్రకటించారు. మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... సమావేశం ముగించుకుని వెళ్లేటప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు గానూ ఈ విధంగా స్పందించారు. ప్రశ్న వినగానే కోపంతో ఊగిపోయిన మంత్రి.. నిందితున్ని ఎన్కౌంటర్ చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలిపారు.
ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం..
"సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన మాత్రం చాలా ఘోరం. వాన్ని తప్పకుండా ఎన్కౌంటర్ చేయ్యాలె. తప్పకుండా మేం వాన్ని పట్టుకుంటాం. ఎన్కౌంటర్ చేస్తం. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తం. మా మనసులో చాలా బాధ ఉన్నది. అన్ని అనుకోంగనే కావు. తప్పకుండా వాళ్లను కలుసుకుని మా ఓదార్పునిస్తం. పరిహారం అందజేస్తం. అన్ని విధాలా ఆదుకుంటాం. వాన్ని ఎన్కౌంటర్ చేస్తం."- మల్లారెడ్డి, మంత్రి
ఇవీ చూడండి:
FAKE CHALLANS: నకిలీ చలాన్ల బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి ధర్మాన కృష్ణదాస్