KTR Interview: అభివృద్ధితో పోటీ పడలేని భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి.. భావోద్వేగాలు రేకెత్తించి లబ్ధిపొందే కుట్రలు పన్నుతోందని తెలంగాణ రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. ప్రశాంత జీవనం సాగిస్తున్న తెలంగాణ ప్రజల్లో భాజపా పాలిత రాష్ట్రాల్లో మాదిరి హలాల్, హిజాబ్ అంటూ మతోన్మాదాన్ని నూరిపోసే ప్రయత్నం ఫలించదన్నారు. ప్రజాభిమానం, ఆశీర్వాదంతో తెరాస తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందని... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలకు ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు కూడా డౌటేనన్నారు. తెలంగాణ స్వీయరాజకీయ అస్థిత్వానికి ప్రతీకగా పార్టీ ఉందన్న ఆయన వచ్చే ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగురేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాకు ఎంఐఎం మాకు ప్రధాన ప్రత్యర్థి కావొచ్చని.... భాజపాకు వంద సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. ఏడేళ్లలో రాష్ట్రాన్నిఅన్ని రంగాల్లో దేశానికే మోడల్‌గా అభివృద్ధి చేశామని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ వివరించారు.
మతం పేరిట చిచ్చు పెడుతున్నారు: కేంద్రప్రభుత్వ విధానాలపై సునిశిత విమర్శలు చేసిన మంత్రి.. ఏడేళ్లలో ఏ వర్గానికీ న్యాయం చేయలేదని ఆరోపించారు. ఎన్నికల హమీలను తుంగలో తొక్కిన మోదీ సర్కార్.. హలాల్, హిజాబ్ అంటూ మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలిసూచీలో అట్టడుగున ఉండటం కేంద్ర పనితీరుకు నిదర్శనమని చురకలు అంటించారు. దేశంలో 30 ఏళ్ల పతాకస్థాయికి దేశంలో ద్రవ్యోల్బణం పడిపోయిందని, ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం 103 అని ఆయన గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ... కష్టాలు రెట్టింపయ్యాయన్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మార్చేందుకే మతం పేర భావోద్వేగాలు రెచ్చగొడుతుందన్నారు. బుల్లెట్ రైలు, నల్లధనం, 2 కోట్ల ఉద్యోగాలు హుళక్కై..హలాల్, హిజాబ్ వంటి సమస్యలు భాజపా సృష్టించిందన్నారు.
ఆరేళ్లలో పరిష్కరించాం: ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు అప్పులు తీసుకుని ఆ రుణాల ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నామంటున్నారు. 60 ఏళ్ల కరెంట్ సమస్యను ఆరేళ్లలో పరిష్కరించామని.. రాష్ట్ర విభజన సమయంలో వీడిపోతే అంధకారమన్న చోటే ఇప్పుడు విద్యుత్ సమస్య ఉందన్నారు. దేశంలో ఎక్కడా జరగని పనులు తెలంగాణలో జరిగాయని..రూ.2 లక్షల కోట్లు జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఉందన్నారు. పార్టీ బలంగా ఉన్నందునే అక్కడక్కడ బల ప్రదర్శనలు, క్షేత్రస్థాయిలో అతి పరిమిత ప్రాంతాల్లో మనస్ఫర్థలు ఉన్నాయన్నారు.
డిపాజిట్ గల్లంతు కావటం ఖాయం: ఖమ్మం ఘటనలో యువకుడిని ఆత్మహత్యకు భాజపా నేతలఏ ప్రేరేపించించి..మంత్రి పువ్వాడపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రిపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయంగా పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఇష్టానుసారం అవాక్కులు చెవాక్కులు పేలవద్దన్నారు. మంత్రిపై ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపాలని...వాపును చూసి భాజపా బలుపు అనుకుంటోందని మంత్రి ఘాటుగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీకి వందస్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావటం ఖాయమన్నారు.
వారిది అనవసర రాద్ధాంతం: ప్రభుత్వాన్ని పడగొడతానన్న గవర్నర్ వ్యాఖ్యలు సరికావని..ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతారా అని ఆయన ప్రశ్నించారు. 111 జీవో ఎత్తివేతపై విపక్షాలది అనవసర రాద్ధాంతంగా కేటీఆర్ అభివర్ణించారు. నదీజలాల వాటాలు తేల్చకుండా కేంద్రం నాన్చుతోందని..ముడిచమురు ధరలు పెంపు వల్లే ఆర్టీసీ ఛార్జీల భారం ప్రజలపై పడిందని మంత్రి వివరించారు.
ఇవీ చదవండి: