‘‘రామారావు గారూ బాగున్నారా’’ అంటూ పారిస్‌లోని లక్సెంబర్గ్ ప్యాలెస్‌లో ఆదివారం అచ్చమైన తెలుగులో ఆత్మీయ పలకరింపు విని ఆశ్చర్యపోయారు తెలంగాణ మంత్రి కేటీఆర్. అక్కడ తెలుగు వారు ఎవరా అని మంత్రి చూస్తుండగా.. ‘రామారావు గారూ! నేనే మాట్లాడేది’ అంటూ ఒక ఫ్రాన్స్ జాతీయుడు ఆయన దగ్గరికి రావడంతో కేటీఆర్(Telangana IT minister KTR) విస్మయం చెందారు.
‘‘నా పేరు ప్రొఫెసర్ డేనియల్ నెగ్గర్స్(Telugu professor Daniel Naggers). నాకు చిన్నప్పటి నుంచి తెలుగంటే ఎంతో అభిమానం. పలుమార్లు తెలుగు రాష్ట్రాలను సందర్శించా. మీ భాష నేర్చుకుని ఫ్రాన్స్ విశ్వవిద్యాలయంలోని జాతీయ ప్రాచ్య భాషా సంస్కృతుల సంస్థలో దక్షిణాసియా హిమాలయ అధ్యయన విభాగంలో మూడు దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్నా’’ అని ఆయన వివరించారు.
ఆయన కృషిని మెచ్చుకున్న కేటీఆర్(Telangana IT minister KTR).. దాదాపు అరగంట సమయం ఆయనతో మాట్లాడారు. త్వరలో హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Chief Minister KCR)ను కలవాలని ఆహ్వానించారు. పోచంపల్లి శాలువాతో సత్కరించారు.
- ఇదీ చదవండి :