Ktr tweet on Google: డిజిటల్ తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం మరో ముందడుగు పడిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టెక్ దిగ్గజం గూగుల్ తన రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో కార్యాలయ ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఏర్పాటుకు ముందుకొచ్చిన గూగుల్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. అమెరికా వెలుపల గూగుల్ ఇంతపెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారని పేర్కొన్నారు. గూగుల్ నూతన కార్యాలయం దశాబ్దాల పాటు చారిత్రాత్మకంగా నిలుస్తుందంటూ కితాబులిచ్చారు.
యువత, విద్యార్థులకు, మహిళలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నానక్‌రాం గూడలో 7.3 ఎకరాల్లో నూతనంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన కార్యాలయ డిజైన్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం యువత, విద్యార్థులు, మహిళలకు ఆర్థికంగా వారికి అండగా నిలిచేందుకు అనువైన కార్యక్రమాలను నిర్వహించేందుకు గానూ గూగుల్ ప్రతినిధులతో ఎంఓయూ చేసుకున్నారు.
గూగుల్‌తో కలిసి 2017 నుంచి పనిచేస్తున్నాం. ఈ కొత్త ఒప్పందం ద్వారా యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పులు తీసుకొచ్చేలా పనిచేయబోతున్నాం. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అందిస్తున్నాం. టాస్క్ ద్వారా యువతకు డిమాండ్ ఉన్న రంగాల్లో సర్టిఫికెట్లు, స్కాలర్షిప్స్ ఇవ్వనున్నాం. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల ద్వారా మహిళలకు డిజిటల్ రంగంలో రాణించేందుకు శిక్షణ ఇవ్వబోతున్నాం. అగ్రిటెక్‌లో గూగుల్ సహకారం అందిస్తుంది. ప్రజారవాణా మెరుగయ్యేందుకు గూగుల్ మ్యాప్ సేవలను మరింత విస్తరించబోతోంది.
- కేటీఆర్, ఐటీశాఖ మంత్రి
ఒప్పందంలో భాగంగా వీ హబ్‌తో కలిసి ఉమెన్ పేరుతో మహిళలకు నానో, మైక్రో వ్యాపార రంగాల్లో రాణిచేందుకు కావాల్సిన సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ ఎంఓయూలో భాగంగా గూగుల్ సంస్థ కొలాబరేటివ్ టూల్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించనున్నారు. ఇక గూగుల్ కెరీర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ టాస్క్ ద్వారా అర్హులైన యువతకు ఐటీ సపోర్ట్, ఐటీ ఆటోమేషిన్, యూఎక్స్ డిజైన్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాటిలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు స్కాలర్షిప్లు అందించనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా పలువురు గూగుల్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.
-
Super excited to break the ground for Google’s largest campus outside of their HQ at Mountain View, USA
— KTR (@KTRTRS) April 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A 3.3 Million sft energy efficient campus built with sustainability will stand as a landmark for Hyderabad for decades to come
Thanks to Google for their continued support pic.twitter.com/wbjbjit9VC
">Super excited to break the ground for Google’s largest campus outside of their HQ at Mountain View, USA
— KTR (@KTRTRS) April 28, 2022
A 3.3 Million sft energy efficient campus built with sustainability will stand as a landmark for Hyderabad for decades to come
Thanks to Google for their continued support pic.twitter.com/wbjbjit9VCSuper excited to break the ground for Google’s largest campus outside of their HQ at Mountain View, USA
— KTR (@KTRTRS) April 28, 2022
A 3.3 Million sft energy efficient campus built with sustainability will stand as a landmark for Hyderabad for decades to come
Thanks to Google for their continued support pic.twitter.com/wbjbjit9VC
ఇవీ చూడండి: ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత