Minister Kannababu on Oil palm : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1.81 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతోందని తెలిపారు. క్రమేపీ ఏడాదికి సగటున 24 వేల హెక్టార్ల సాగును పెంచుకుంటూ పోయేలా ప్రణాళికలు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. మెట్ట ప్రాంతాల్లో వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటగానూ.. పొగాకు, సుబాబుల్, యూకలిప్టస్ తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు సబ్సిడీలను కూడా ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆయిల్ పామ్ విస్తరణ, అభివృద్ధి కోసం 306 కోట్ల రూపాయల మేర వ్యయం చేసినట్టు కన్నబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతాలను మ్యాపింగ్ చేసేందుకు నిపుణులతో కూడిన అధికార బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి : New Districts: 'జిల్లాల విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం'