పంట ఉత్పత్తుల విక్రయానికి జనతా బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రైతుల ఉత్పత్తులకు స్థానిక మార్కెట్ ఉండేలా జనతా బజార్లు ఉంటాయన్నారు. రాయలసీమ నుంచి అరటి, బత్తాయిని మార్కెట్లకు తరలిస్తున్నామన్న కన్నబాబు.. టమాటా, మిర్చి, అరటి, పసుపు కొని రైతుకు నష్టం లేకుండా చూస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 1,300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ధాన్యానికి రూ.1,760 మద్దతు ధర ఇస్తున్నామన్న మంత్రి.. తడిసిన శనగలూ కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని వివరించారు. మే 15న ప్రతి రైతు ఖాతాలో రైతుభరోసా పెట్టుబడి సాయం వేయనున్నట్లు వెల్లడించారు. రైతుభరోసా, మత్స్యకార భరోసాకు సోషల్ ఆడిట్ చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి గతంలో ఈ సాయం రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతమున్న 1,070 రైతుబజార్లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా కలవరం: దేశంలో 723కు పెరిగిన మరణాలు