ETV Bharat / city

'వ్యవసాయ పారిశ్రామికీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ' - కన్నబాబు అన్ ఫార్మర్స్

రాష్ట్రంలో ఎగుమతుల ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులు ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. వ్యవసాయ, పరిశ్రమల శాఖల సమన్వయంతో ఓ టాస్క్​ఫోర్స్ ఏర్పాటుచేసి పలు పరిశ్రమల అభివృద్ధికి కార్యాచరణ చేపడతామన్నారు. రాజధాని రైతుల మరణాలపై స్పందించిన మంత్రి.. రైతులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం ఏ ఒక్క నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. తెదేపా నేతలే కావాలని రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆక్షేపించారు.

kanna babu
కురసాల కన్నబాబు
author img

By

Published : Jan 8, 2020, 7:38 PM IST

వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా.. ఎగుమతులకు అవకాశం ఉండేలా ప్రణాళికలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అమరావతిలో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ, పరిశ్రమల శాఖల సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు శాఖల అధికారులతో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ ఆలోచనపై ఓ కార్యశాల ఏర్పాటుచేయనున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలతో వివిధ ఉత్పత్తులు తయారీపై దృష్టి సారించామని అన్నారు.

'వ్యవసాయ పారిశ్రామికీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ'

అనంత ఉద్యాన ఉత్పత్తుల హబ్​

అనంతపురం జిల్లాను ఉద్యానవన ఉత్పత్తుల హబ్​గా అభివృద్ధి చేస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటుపై సంయుక్త టాస్క్​ఫోర్స్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. లాజిస్టిక్ చైన్ కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. త్వరగా పాడయ్యే కూరగాయలు, పువ్వులు, ఇతర ఉత్పత్తులు త్వరితగతిన ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రైతుల్ని రెచ్చగొట్టేది తెదేపా నేతలే

రాజధాని రైతులకు పూర్తి న్యాయం చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. తెదేపా నేతలు రైతులను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. రైతుల మృతిపై ప్రభుత్వం అన్ని వివరాలు తెలుసుకుని రైతులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోకుండా.. తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెదేపా నేతలు కావాలనే రైతులను రాజకీయాల్లోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల ముసుగులో కొంత మంది తెదేపా నేతలు వైకాపా ఎమ్మెల్యేలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

రాజధాని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి కన్నబాబు

ఇదీ చదవండి:

'స్థానిక సంస్థల ఎన్నికలు వైకాపా పాలనకు రిఫరెండం కాదు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.