ETV Bharat / city

'పేదలకు ఇళ్లు - విద్యార్థులకు హస్టళ్ల'పై మంత్రులు ఏమన్నారంటే.. - రాష్ట్రంలో గురుకుల పాఠశాలల వార్తలు

Ministers Review on Navaratnallu: నవరత్నాలలో భాగంగా 'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమం కొనసాగుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. నిర్మాణాలకు అవసరమైన నీరు, మౌలిక సదుపాయాలు పూర్తికి తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందిస్తామన్నారు. మరో వైపు 'గడప గడపకు మన ప్రభుత్వం 'కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లోనే బీసీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల రూపురేఖలు మార్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

మంత్రులు
మంత్రులు
author img

By

Published : May 17, 2022, 9:13 PM IST

Minister Review on Housing Scheme: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల నిర్మాణంపై ఆ శాఖ మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. నిర్మాణాలకు జియో ట్యాగింగ్ సహా జియో మ్యాపింగ్ తదితర పనుల్ని సత్వరం చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యం ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. నిర్మాణాలకు అవసరమైన నీరు, మౌలిక సదుపాయాలు పూర్తికి తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కొనసాగుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ పక్క ఇల్లు ఉండేలా ప్రణాళిక కొనసాగుతుందన్నారు. 15 లక్షల మందికి మొదటి విడతలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇళ్ల నిర్మాణం కోసం కాల్ సెంటర్: లే అవుట్లలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వసతులు కల్పిస్తున్నామని జోగి రమేష్ వివరించారు. ప్రజా ప్రతినిధులు అందరినీ భాగస్వాములను చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం కాల్ సెంటర్ ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులకు రుణ సౌకర్యంతో మెటీరియల్ అందజేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల వేగవంతంపై రివ్యూ చేస్తామని, లబ్ధిదారులకు ఎవరికి అన్యాయం జరగదని మంత్రి తెల్చిచెప్పారు. టిడ్కో ఇళ్లను కూడా త్వరలోనే అందిస్తామన్నారు.

ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు: రాష్ట్రవ్యాప్తంగా 'గడప గడపకు మన ప్రభుత్వం 'కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల గురించి చెప్పేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలోనూ ప్రభుత్వ పథకాలపై హర్షం వ్యక్తమైందన్నారు.

రూపురేఖలు మార్చేస్తాం: మరోవైపు సచివాలయంలో బీసీ సంక్షేమశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ ఆధునీకరణపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. వేసవి సెలవుల్లోనే బీసీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల రూపురేఖలు మార్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యమైన ఆహారం తయారు చేసేలా హాస్టళ్లలో పనిచేసే వారికి శిక్షణ కార్యక్రమాలు ఇస్తామన్నారు. అలాగే హాస్టళ్లు, పాఠశాలల్లో క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేకదృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు.

ఇవీ చదవండి: ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎం జగన్‌కు అర్థమైంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.