ETV Bharat / city

"తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతోంది"

author img

By

Published : Jul 6, 2022, 4:50 PM IST

Minister Harish Rao on Group-4: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తోంది. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

harish
harish

త్వరలోనే గ్రూప్-4కి నోటిఫికేషన్ రాబోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా పొన్నాలలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో సమావేశమైన మంత్రి... డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తూ.. ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ.. యువతను ప్రోత్సహిస్తుంటే... కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖాళీలు భర్తీ చేయకుండా యువత నోట్లో మట్టి కొడుతుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం తుమ్మితే ఊడిపోయే ఉద్యోగమని ఎద్దేవా చేశారు. ఏ రంగానికి కూడా భాజపా ప్రభుత్వం మేలు చేయలేదని.... భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం ఉండదని విరుచుకుపడ్డారు.

డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తాం. త్వరలోనే గ్రూప్-4కి నోటిఫికేషన్ రాబోతుంది. కేంద్రంలో 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యువతను మోసం చేసేందుకే అగ్నిపథ్‌ పథకం. - మంత్రి హరీశ్‌రావు

అతి తొందరలోనే డీఎస్సీ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణత 32 శాతం ఉంటే... కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌లో 82 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయం అన్నారు. టెట్ ఉత్తీర్ణత అయిన విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే ఉచిత కోచింగ్ సెంటర్‌కు సార్ధకత లభిస్తుందని తెలిపారు.

కేంద్రంలో 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న మంత్రి... ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. యువతను మోసం చేసేందుకే అగ్నిపథ్‌ పథకం తీసుకువచ్చిందని ఆరోపించారు. అదే రాష్ట్రంలో ఒక లక్ష 50 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే... ఇప్పటికే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

ఫేక్‌న్యూస్‌లు క్రియేట్ చేసి గ్లోబల్స్ ప్రచారం చేయడంలో భాజపా వాళ్లను మించిన వాళ్లు లేరని.. భాజపా విష ప్రచారాలను ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 8 సంవత్సరాల భాజపా పాలనలో ప్రభుత్వ సంస్థలను అమ్మడం.. తప్ప కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. తొందరలోనే ఉచిత డీఎస్సీ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని.. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.