ETV Bharat / city

'కడప ఉక్కు’ ఏర్పాటుకు ఎస్సార్‌ తదితర సంస్థలతో మాట్లాడుతున్నాం'

author img

By

Published : Apr 1, 2021, 5:57 AM IST

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఎంచుకున్న లిబర్టీ స్టీల్స్‌కు ఆర్థిక వనరులు నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆ సంస్థ ప్రాజెక్టు చేపట్టే పరిస్థితిలో లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. లిబర్టీ స్టీల్స్‌ ప్రతిపాదనను పక్కనపెట్టి, ప్రత్యామ్నాయం చూస్తున్నామని స్పష్టం చేశారు.

kadapa steel plant
కడప ఉక్కు పరిశ్రమ

పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు ప్రభుత్వ రాయితీలపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. లిబర్టీ స్టీల్స్‌ అంశంపై సమీక్షిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. ‘ఇప్పటికే సమీక్షించాం. బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయంతోనూ మాట్లాడాం. లిబర్టీ స్టీల్స్‌ దివాలా తీయలేదు. దానికి నిధులు సమకూర్చే కంపెనీల్లో ఒకటి దివాలా తీసింది. ఆర్థికంగా ఆదుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వమూ ముందుకు రాలేదని పత్రికల్లో వార్తల్ని బట్టి తెలుస్తోంది. అందుకే ప్లాన్‌-బిపై దృష్టి పెట్టాం. ఎల్‌2గా వచ్చిన ఎస్సార్‌ స్టీల్స్‌తోపాటు ఇతర సంస్థలతోనూ చర్చిస్తున్నాం. ఏదేమైనా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం ఖాయం’ అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎస్సార్‌నూ అదే కోరుతున్నాం
‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్కువ ఈక్విటీ భాగస్వామ్యం ప్రతిపాదించిన లిబర్టీ స్టీల్స్‌ను కడప ఉక్కు కర్మాగారానికి భాగస్వామిగా ఎంపిక చేశాం. అదే ప్రతిపాదనతో చేయాలని ఎస్సార్‌ స్టీల్స్‌ను కోరుతున్నాం. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడిదారులెవరూ రాకపోయినా, ప్రభుత్వమే సొంతంగా నెలకొల్పుతుంది. రాయలసీమలో ఉక్కు కర్మాగారం విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. కేంద్రం పట్టించుకోని ఆ హామీని మేం పూర్తి చేస్తున్నాం’ అని మంత్రి చెప్పారు. కడప ఉక్కు కర్మాగారంలో పోస్కో సంస్థ భాగస్వామిగా మారే అవకాశముందా?
అన్న ప్రశ్నకు.. ‘పోస్కో సొంతంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. తీర ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేయాలన్నది వాళ్ల ఆలోచన. కృష్ణపట్నం దగ్గర స్థలం చూశారు. ప్రకాశం జిల్లాలోనూ చూస్తున్నారు. వాళ్లకు ఎక్కడ అనుకూలం అనుకుంటే అక్కడ పెడతారు’ అని తెలిపారు. విభజన హామీల అమలుకు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయట్లేదు అని విలేకర్లు ప్రశ్నించగా మేం ఒత్తిడి పెడుతూనే ఉన్నాం.. వారికి పూర్తిగా మన మద్దతు అవసరమై ఉంటే మన మాట వినేవారని మంత్రి పేర్కొన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం నిర్వహించలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు కదా? ఇలా కేంద్రం అమలు చేయని హామీలన్నీ తలకెత్తుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదా? అని విలేకర్లు ప్రశ్నించారు. ‘ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత. అన్నిచోట్లా లాభనష్టాలు బేరీజు వేసుకోకూడదు. చక్కెర కర్మాగారాలన్నీ నష్టాల్లో ఉన్నా రైతుల సంక్షేమం దృష్ట్యా వాటిని నిర్వహిస్తున్నాం’ అని మంత్రి సమాధానమిచ్చారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎంఆర్‌ మెటలర్జికల్‌ రిసోర్సెస్‌- ఏజీ సంస్థ కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకొచ్చిందా అన్న ప్రశ్నకు... ‘దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్‌ల నుంచి కంపెనీలు వచ్చాయి. కడపలో రెండో కర్మాగారం ఏర్పాటు చేస్తామని, కృష్ణపట్నం వద్ద ఇంకో ఉక్కు కర్మాగారం పెడతామని రకరకాల ప్రతిపాదనలు చేస్తున్నారు. కానీ డీపీఆర్‌ దశకు వెళ్లలేదు’ అని మంత్రి తెలిపారు.

పరిశ్రమలకు రాయితీలపై సోషల్‌ ఆడిట్‌
రాష్ట్రంలో భారీ పరిశ్రమలకు ఏటా రూ.వెయ్యి కోట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.300 కోట్లు చొప్పున రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ రాయితీలు అర్హతలున్న కంపెనీలకే వెళుతున్నాయా? వాటివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతోంది అన్న అంశాల్ని బేరీజు వేసేందుకు సామాజిక తనిఖీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దానిపై చర్చించేందుకు బుధవారం ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఇన్నోవేషన్‌ రంగాలపై ఏప్రిల్‌ 2న వివిధ కంపెనీలకు చెందిన 35 మంది సీఈవోలతో విజయవాడలో కార్యశాల నిర్వహిస్తున్నామన్నారు. నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విధానంపై వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. 2021-22 బడ్జెట్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖలకు రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు కేటాయింపులు జరపాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరించే అంశంపై నోడల్‌ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను నియమించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేశాక, దాన్ని అనుసరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు.

ఇదీ చదవండి

తిరుపతి బైపోల్: భాజపా సరికొత్త వ్యూహం.. క్షేత్రస్థాయిలోకి వెళ్లటమే లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.