రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న నైపుణ్య కళాశాలలో త్రీడీ ఎక్స్ పీరియన్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టడంపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్రీడీ ఎక్స్ పీరియన్స్ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు డసాల్ట్ సంస్థతో పాటు సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చినట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు మంత్రితో చర్చలు జరిపారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ కు త్రీడీ ఎక్స్ పీరియన్స్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని మంత్రికి వివరించారు. ప్రభుత్వం చేపట్టే కీలక ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు వాటి పనుల పురోగతితో పాటు ఇతర అంశాలను కూడా నిశ్చితంగా పరిశీలించే అవకాశముందని సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సాంకేతికత ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వివరాలను తెలుసుకోవడం తదితర అవకాశాలపై డసాల్ట్ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. దీనికి సంబంధించి నమూనాలతో రావాల్సిందిగా ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు.
ఇదీ చదవండి