ETV Bharat / city

ప్రతి నియోజకవర్గంలో ఎమ్​ఎస్​ఎమ్​ఈ పార్కు ఏర్పాటు : మంత్రి గౌతమ్​ రెడ్డి - ఎమ్​ఎస్​ఎమ్​ఈలపై మంత్రి గౌతమ్​ రెడ్డి కామెంట్స్

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు సరళమైన ఎమ్​ఎస్​ఎమ్​ఈ వ్యవస్థను ఏర్పాటుచేయాలని పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్​ రెడ్డి....అధికారులను ఆదేశించారు. కొత్త పారిశ్రామిక విధానంలో ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు ప్రాధాన్యం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్​ఎస్​ఎమ్​ఈ పార్కు ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్క్​ ఫ్రమ్​ హోమ్​పై మరింత దృష్టి సారించాలని ఐటీ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి గౌతమ్​ రెడ్డి
మంత్రి గౌతమ్​ రెడ్డి
author img

By

Published : Oct 1, 2020, 4:16 AM IST

ప్రతీ ఔత్సాహికుడు రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించేందుకు సరళమైన ఎమ్ఎస్ఎమ్ఈ వ్యవస్థను ఏర్పాటుచేయాలని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 31 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కొత్త పారిశ్రామిక విధానంతో ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో మంత్రి మేకపాటి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్ఎస్ఎమ్ఈ విభాగం ద్వారా జిల్లాలలో ఎక్కువ పరిశ్రమలను నెలకొల్పడంలో కీలకమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'పై అధికారులతో మంత్రి చర్చించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్​పై మరింత దృష్టి పెట్టాలని ఐటీ శాఖ అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులకు ఏపీఎస్ఎఫ్ఎల్, ఇతర ఐఎస్​పీల భాగస్వామ్యంతో 99.9 శాతం మంచి బ్యాండ్ విడ్త్​తో ఇంటర్నెట్ అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పరిశ్రమలోని వ్యర్థాలను పరిశీలించడం, పేలుడు పదార్థాలు ఉంటే అప్రమత్తం చేయడం, పేలుడు జరిగితే అలార్మ్ ఇచ్చి సందేశాలు పంపే అత్యాధునిక టెక్నాలజీ గురించి ఎవెనియోన్ సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చించారు.

హెచ్​సీఎల్ ఐటీ సంస్థ 1000+ ఐడియాప్రిన్యుర్ వేడుకలలో ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అనంతరం 'కైనెటిక్ గ్రీన్' సంస్థ ఎండీ రితేష్​ మంత్రిని కలిశారు. విద్యుత్ అవసరాలు, రీఛార్జి యూనిట్లపై మంత్రి మేకపాటి చర్చించారు. ఈవీ యూనిట్ ఏర్పాటుకు ఇప్పటికే ఆ సంస్థ సిద్ధంగా ఉండడంతో ఉపాధి, వ్యయం, పెట్టుబడులపై పూర్తి వివరాలు అందజేస్తే..ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేపడతామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : చికిత్స పొందుతూ... విచారణలో పాల్గొన్న ఏఏజీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.