ETV Bharat / city

'జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్షతో భూ వివాదాలకు ముగింపు' - land resurvey in ap latest news

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీసర్వేలో గ్రామాల సరిహద్దు గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రుల కమిటీ సూచించింది. గ్రామాల మ్యాప్​లను రూపోందించటం ద్వారా ల్యాండ్ పార్శిళ్లను గుర్తించే అవకాశముందని స్పష్టం చేసింది. భూముల సమగ్ర రీసర్వేపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. నిర్ధిష్ట కాలపరిమితిలోగానే రీసర్వే పూర్తి అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని కమిటీ అధికారులను ఆదేశించింది.

minister committee resurvey on land survey

author img

By

Published : Jul 23, 2021, 8:09 PM IST

జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు ముగింపు పలికే అవకాశముందని మంత్రుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. భూముల సమగ్ర రీసర్వేపై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందేళ్ల తర్వాత ఇలాంటి భూ సర్వే జరుగుతోందని మంత్రులు అన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్‌, రోవర్ల సహకారంతో భూసర్వే నిర్వహిస్తున్నట్టు కమిటీ తెలియజేసింది. రాష్ట్రంలో మొత్తం 70 కార్స్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. సమగ్ర సర్వే కోసం 13,371 పంచాయతీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించారన్నారు. ఇప్పటి వరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్ధం అయినట్టు మంత్రుల కమిటీ నిర్ధరించింది. 240 గ్రామాలకు చెందిన విలేజ్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్టు అధికారులు వివరించారు.

మొత్తం 34 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, వ్యాలిడేషన్ సర్వే పూర్తైందని రెవెన్యూ అధికారులు.. మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. 70.2 లక్షల అసెస్‌మెంట్లకుగానూ ఇప్పటి వరకు 13.7 లక్షల అసెస్‌మెంట్ల పరిశీలన పూర్తి అయ్యిందని వివరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే నిర్థిష్ట కాలపరిమితిలోనే పూర్తి కావాలని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర సర్వే ద్వారా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళణ పూర్తి అవుతుందని కమిటీ అభిప్రాయపడింది.

ఇదీ చదవండి:

ap inter results 2021: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.