రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌ను కలవనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల రాష్ట్రానికి పంపిన సమాచారంపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై చర్చించనున్నట్లు సమాచారం.
బుధవారం దిల్లీ వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి...నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, కేంద్రమంత్రి హర్దీప్సింగ్ను కలుసుకున్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర సాయం, కిడ్నీ వ్యాధులు, యురేనియం పీడిత ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో చర్చించారు. పర్యటన అనంతరం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు.
ఇదీ చదవండి : నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను కలిసిన ఆర్థికమంత్రి బుగ్గన