ETV Bharat / city

'స్థానికం' వాయిదా వెనక కుట్ర: మంత్రి బుగ్గన అనుమానం

కేంద్ర హోం శాఖకు లేఖ రాశారో లేదో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తేల్చి చెప్పాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.

minister buggana
minister buggana
author img

By

Published : Mar 21, 2020, 1:32 PM IST

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన

స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ చర్చించారా? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌.. వైద్య శాఖలోని ఎవరితో సమీక్ష జరిపారని అడిగారు. ఎక్కడైనా అనధికారికంగా సమీక్ష జరుపుతారా? అని ప్రశ్నించారు. కరోనా వల్ల వాయిదా వేస్తే.. ఎన్నికల కోడ్‌ 6 వారాలపాటు ఎందుకు ఉంచారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు ఎన్నికల కోడ్‌ అడ్డు రాదా? అని ప్రశ్నించారు.

స్థానిక ఎన్నికలు ఆపాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారనే అనుమానం వస్తోందన్న మంత్రి బుగ్గన... ఎన్నికలు ఆపేందుకు తోమర్‌ కేసును వాడకూడదన్నారు. స్థానిక ఎన్నికలు పెట్టేముందు ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎస్‌ఈసీ సుప్రీం కోర్టులో కేవియట్‌ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో గెలవకుంటే పదవులు పోతాయని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు.

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం ఎలా అవుతాయన్నది తెదేపా అధినేత చంద్రబాబుకు తెలియదా అన్నారు. కర్నూలులో అనేకచోట్ల తెదేపా నేతలు నామినేషన్లు వేశారన్న ఆయన.. డోన్‌ పురపాలికను తెదేపా పూర్తిగా వదిలిపెట్టిందని ఆరోపించారు. తెదేపా నేతలతో తాము బలవంతంగా నామినేషన్లు వేయించాలా? అని వ్యాఖ్యానించారు.

కరోనా నివారణకు సీఎం జగన్‌ అనేక చర్యలు తీసుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి చికిత్స నిమిత్తం ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. జ్వరానికి పారాసిటమాల్‌ వాడతారా.. లేదా.. పరిశుభ్రత కోసం అన్నిచోట్లా బ్లీచింగ్ పౌడర్ వాడతారా.. లేదా..అంటూ బుగ్గన ప్రశ్నించారు. సీఎం మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత నిర్వహించేందుకే అధికారం ఇస్తారన్న ఆయన.. రాజకీయం చేయవద్దని ఎన్నికల కమిషనర్‌ను కోరుతున్నానన్నారు. రాజకీయ కోణం లేకుండానే ఇంతదూరం వచ్చిందా అని సుప్రీంకోర్టు అడిగిందన్న మంత్రి.. రాష్ట్రంతో సంప్రదించాకే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని కోర్టు చెప్పిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఎస్‌ఈసీని కోరారు.

ఇవీ చదవండి:

కుమార్తె సహా.. దంపతుల బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.