తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ.2వేల కోట్ల నగదు దొరికిందని తాము అనలేదని... మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పన్ను ఎగవేత, అక్రమాలకు సంబంధించిన పత్రాలు దొరికాయని చెప్పామన్నారు. ఇదే విషయాన్ని ఐటీ అధికారులు చెప్పారని.. ఈ మేరకు ఆ పత్రాలను సీజ్ చేశారన్నారు. తెదేపా నేతలు పరువునష్టం దావా వేస్తామంటే భయపడే వారెవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లపాటు తెదేపా నేతలు దోపిడీ చేశారని.. పంచభూతాలను సైతం తినేశారని బొత్స ఆరోపించారు.
'రూ.2 వేల కోట్లు దొరికాయని మేము అనలేదు' - చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు
చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో 2వేల కోట్లు దొరికాయని తామెప్పుడూ అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెదేపా నేతలు పరువునష్టం దావా వేస్తామంటే భయపడే వారెవరూ లేరని బొత్స వ్యాఖ్యానించారు.

సంబంధిత కథనం