మండలి ఛైర్మన్ షరీఫ్ చిత్రపటానికి రాజధాని రైతుల పాలాభిషేకం - మండలి ఛైర్మన్ షరీఫ్‌కు పాలభిషేకం
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీ పంపుతూ.. నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ షరీఫ్‌పై రాజధాని రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తుళ్లూరు మండలం బోరుపాలెం, వెలగపూడిలో షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మానవతా విలువలు కాపాడారంటూ నినాదాలు చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా సరైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.