ETV Bharat / city

వలస కార్మికుల గోస: ఇటు రానివ్వరు.. అటు తిరిగి పోలేరు

author img

By

Published : May 5, 2020, 6:02 PM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఆంధ్రా సరిహద్దు అయిన గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద ఏపీ పోలీసులు వలస కార్మికులను అడ్డుకున్నారు. తమను సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలంటూ నిన్నటి నుంచి కార్మికులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

migrant-workers-facing-problems-at-inter-state-checkposts
వలస కార్మికుల గోస: అటు పోనివ్వరు.. ఇటు పోలేరు

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో పనిచేసే సుమారు 15 మంది కార్మికులు ఓ వాహనం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కావలికి బయలుదేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద గల ఆంధ్రా సరిహద్దు అయిన గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద ఏపీ పోలీసులు వీరి వాహనాన్ని నిలిపివేశారు. డ్రైవర్​... కూలీలను అక్కడే వదిలేసి వెళ్లాడు. ఫలితంగా నిన్నటి నుంచి కూలీలు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

రూ. 30 వేలు పెట్టి వాహనాలను మాట్లాడుకుని ఇంత దూరం వస్తే.. పోలీసులు తమను అనుమతించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి వెనక్కు వెళ్లడానికీ వాహనం లేదని వాపోతున్నారు. నిన్నటి నుంచి భోజనం పెట్టేవారు లేక ఇబ్బందులు పడుతున్నామని.. పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేయడం బాధాకరంగా ఉందని ఈటీవీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఇదీ చూడండి:

క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.