తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికి పరిధిలోని కొనుప్పలపాడులో సర్వే నంబరు 22బీలో 649.86 హెక్టార్ల పరిధిలో సున్నపు రాతి గనులను గతంలో త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజుకు తీసుకుంది. సున్నపు రాతి గనుల లీజును రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ ప్లాంట్ నిర్మాణ గడువు ఐదేళ్లు పొడిగిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సైతం వైకాపా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్ నిర్మాణంలో ముందడుగు పడనందునే రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. లీజు ప్రాంతంలో 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి తవ్వకంపై విచారణకు ఆదేశించింది. సున్నపురాయి తవ్వకం, రవాణాపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : 'జిల్లాలో గజం భూమి కూడా కబ్జా కానివ్వను'