సినీ కార్మికులందరికీ టీకా వేయించే బాధ్యత.. యూనియన్ నాయకులు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సూచించారు. కరోనా క్రైసిస్ చారిటీ(ccc), అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇవాళ 300 మంది కార్మికులకు కొవిషీల్డ్ టీకా వేయించారు. గతంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీసీసీ.. టీకాల కొరత కారణంగా వాయిదా వేసింది. మరలా ఆ కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన చిరంజీవి... 24 విభాగాల కార్మికులతోపాటు నటీనటులందరికీ ఉచితంగా టీకా వేయనున్నట్లు తెలిపారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, కార్యదర్శి దొరై, సీసీసీ సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి టీకా కార్యక్రమాన్ని చిరంజీవి రక్తనిధి కేంద్రంలో పునఃప్రారంభించారు. సినీ కార్మికులంతా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కరోనా టీకా వేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,933 కరోనా కేసులు నమోదు