రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో...జిల్లాల్లో కొవిడ్ ఆసుపత్రులు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన మంత్రి.. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దృష్ట్యా సర్వే చేయించాలని నిర్ణయించారు.
విజయవాడలోని కార్పొరేట్ కళాశాలల హాస్టళ్ల నుంచి తిరిగి వచ్చిన 70 మంది విద్యార్ధులు.., చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తికి కారణమైనట్టు ఆ జిల్లా అధికారులు చెప్పారు. చిత్తూరు, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 108 పడకల వార్డుల్ని ప్రత్యేకించి కరోనా రోగుల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోనూ.. కరోనా వ్యాప్తినిరోధక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి. ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యం..మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ విచారణ