ETV Bharat / city

తెలంగాణ: నేటితో ముగియనున్న మేడారం చినజాతర - తెలంగాణ మేడారం చినజాతర వార్తలు

తెలంగాణ మేడారంలో నాలుగు రోజుల చిన్నజాతర నేటితో ముగియనుంది. దూరప్రాంతాల నుంచి సైతం భక్తులు వచ్చి వన దేవతలను దర్శనం చేసుకుంటున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తలుల్ల వద్దకు భక్తులు కుటుంబసమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల వద్ద శివసత్తుల నృత్యాలు హోరెత్తిస్తున్నాయి. అభయమిచ్చి కాపాడే అమ్మల చెంత భక్తులు పుట్టిన రోజు, పెళ్లి రోజు, అన్నప్రాసన వేడుకలు జరుపుకుని పారవశ్యం చెందుతున్నారు.

medaram cihinajathara
నేటితో ముగియనున్న మేడారం చినజాతర
author img

By

Published : Feb 27, 2021, 11:44 AM IST

నేటితో ముగియనున్న మేడారం చినజాతర

తెలంగాణ మేడారంలో జరుగుతున్న చిన్న జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శుక్రవారం మూడోరోజూ భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయాన్నే అమ్మవార్ల పూజా సామగ్రి అడేరాలు, పసుపుకుంకుమ గద్దెకు చేర్చడంతో మండమెలిగె పండుగ ఘట్టం ముగిసినా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.

జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన గద్దెలకు వచ్చి ఎత్తుబెల్లం, చీరసారె, పూలుపండ్లను, టెంకాయ, సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జంపన్నవాగు, చిలుకలగుట్ట, రెడ్డిగూడెం, ఊరట్టం, కొత్తూరు తదితర ప్రాంతాల్లో భక్తులు గుడారాలు ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు మొక్కులు కొనసాగాయి. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శుక్రవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిన్న జాతర శనివారంతో ముగుస్తుంది.

నేడే మాఘశుద్ధ పౌర్ణమి

సమ్మక్క జాతరలో మాఘశుద్ధ పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది. సమ్మక్క దేవత గిరిజనులకు నిండు పౌర్ణమి రోజునే దొరికింది. గిరిజనుల గుండెల్లో స్థానం సంపాదించిన సమ్మక్కతల్లి వారి నుంచి వీడి వనప్రవేశం చేసింది కూడా పౌర్ణమి నాడే. అందుకోసమే పౌర్ణమి పురస్కరించుకునే మహాజాతర, చిన జాతరను నిర్వహిస్తారు. ఆనాటి నుంచి మాఘశుద్ధ పౌర్ణమికి అటుఇటుగా వచ్చే బుధవారం రోజున మహాజాతర, మండమెలిగె పండుగలను ప్రారంభిస్తారు. దీంతో భక్తులు కూడా అదే రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. నేటి పౌర్ణమి రోజునే చిన జాతర ముగియనుంది. ఆదివాసీ గిరిజన పండుగలు, శుభకార్యాలు కూడా పౌర్ణమి, అమావాస్యలను చూసే నిర్వహిస్తారు.

ఇవీ చూడండి:

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్, ఉప్పెన చిత్ర బృందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.