ETV Bharat / city

ప్రియుడ్ని మరచి.. భర్తతో కాపురం చేయలేక బలవన్మరణం - telangana news

పెద్దల మాటకు కట్టుబడి వారు చూసిన వ్యక్తినే వివాహమాడింది. అప్పటికే మరో వ్యక్తిని ప్రేమించిన ఆ యువతి భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక ప్రియుడితో కలిసి గత నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెద్దలు వారిని తిరిగి రప్పించడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్​లో మండల పరిధిలోని నాగారంలో చోటు చేసుకుంది.

married women suicide
వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Jan 2, 2021, 5:17 PM IST

పెద్దల మాటకు కట్టుబడి వారు చూసిన వ్యక్తినే వివాహమాడింది. అప్పటికే మరో వ్యక్తిని ప్రేమించిన ఆ యువతి భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక ప్రియుడితో కలిసి గత నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెద్దలు వారిని తిరిగి రప్పించడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్​లో మండలపరిధిలోని నాగారంలో చోటు చేసుకుంది.

నాగారం గ్రామానికి చెందిన శృతికి 8 నెలల క్రితం చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. అప్పటికే దోర్నాల్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పలేక వారు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. భర్తతో కాపురం చేస్తున్న ప్రియుడిని మరిచిపోలేక అతడితో కలిసి వెళ్లిపోయింది.

భర్త ఫిర్యాదు మేరకు చేవెళ్ల ఠాణాలో అదృశ్యం కేసు నమోదైంది. పోలీసులు ప్రియుడితో ఉన్న శృతిని వెతికి పట్టుకుని పుట్టింటి వారికి అప్పగించారు. అటు భర్తతో కాపురం చేయలేక, ప్రియుడ్ని మరిచిపోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఇరువర్గాల మధ్య ఘర్షణ... 13 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.