ETV Bharat / city

శాశ్వత భవనంలోకి మంగళగిరి ఎయిమ్స్ - మంగళగిరి ఎయిమ్స్ వార్తలు

కార్పొరేట్ తరహా వైద్య సేవలను అతి తక్కువ ధరలకు అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్​లో... మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఔట్ పేషెంట్లకు తాత్కాలిక భవనంలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ నెల 9న అత్యాధునిక పరికరాలతో ఉన్న ఓపీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.

mangalagiri-aiims-shift-into-permanent-buildings
శాశ్వత భవనంలో మంగళగిరి ఎయిమ్స్
author img

By

Published : Dec 7, 2019, 7:57 PM IST

మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సేవలు విస్తృతం కాబోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఔట్ పేషెంట్ విభాగాన్ని తాత్కాలిక భవనంలో ప్రారంభించింది ఎయిమ్స్. ప్రస్తుతం ఇక్కడ 12 విభాగాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మరోవైపు శాశ్వత భవనాల నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఊర్లోని వారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు రోజుకు 300 మంది వరకూ ఎయిమ్స్​కు వస్తున్నారు.

ఈ నెల 9న నూతన భవనం అందుబాటులోకి రానుంది. ఆధునిక సౌకర్యాలతో ఔట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. 18 విభాగాల ద్వారా 120 గదుల్లో చికిత్స అందించనున్నారు. పది రూపాయల ఓపీ రుసుముతోనే కార్పొరేట్ వైద్య సేవలందిస్తున్నారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్, ఈఎన్​టీ, కంటి వైద్యం, మానసిక వైద్యం, చర్మం, దంత, ఎముకలు, గైనిక్ సేవలు, చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులన్నింటికి ఒకే బ్లాకులో వైద్యం అందిస్తున్నారు. నూతన భవనం 5 అంతస్తులతో నిర్మిస్తున్నందున ఒక్కో విభాగానికి ప్రత్యేక గది అందుబాటులో ఉంటుందని ఎయిమ్స్ సూపరింటెండెంట్ రాజేశ్ కక్కర్ చెప్పారు. ఎయిమ్స్​లో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండి.. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరి ఎయిమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం 1,618 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇప్పటివరకూ పనుల కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇసుక కొరత కారణంగా ఇటీవల వరకు నత్తనడకన సాగిన పనులు క్రమేణా పుంజుకుంటున్నాయి. ఇన్​పేషెంట్ వైద్య సేవలు 2020 అక్టోబరు నుంచి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ.. 2020 మే నుంచి ఆయుష్ బ్లాక్ సిద్ధమైతే వైద్య సేవలు ప్రారంభిస్తామని ఎయిమ్స్ అధ్యక్షులు డాక్టర్ టీఎస్. రవికుమార్ తెలిపారు. ఈ నెల నుంచి పల్మనాలజీ, పల్మనరి మెడిసిన్, ట్రాన్సిఫ్యూజన్ విభాగాల వైద్య సేవలు, డిజిటల్ ఎక్సరే, మెమోగ్రఫీ, మైనర్ చికిత్సలు, డేకేర్ సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

శాశ్వత భవనంలో మంగళగిరి ఎయిమ్స్

ఇవీ చదవండి..

హమ్మయ్యా... ఆకలి తీర్చింది..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.