అమరావతి రాజధాని పరిణామాలపై రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల్లో తీవ్రమైన ఆవేదన నెలకొందని...ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాజధాని మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నానన్నారు. తమకు రాజధాని వస్తుందనే సంతోషం ఉత్తరాంధ్ర ప్రజల్లో లేదన్న ఆయన... ఇక రాజధాని లేదనే భావన రాయలసీమ ప్రజల్లో ఏర్పడిందన్నారు. ఇది అంతిమంగా ప్రాంతీయ విద్వేషాలకు దారీతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మార్పును రాష్ట్రవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.
ఇదీ చదవండి : రాజమహేంద్రవరంలో రైతుల మానవహారం