ETV Bharat / city

ఇది 13 కుటుంబాల వ్యథ.. ఓ ఘనుడు అమ్మేసిన ఊరి కథ! - man sale Burugidda village updates

నల్లా బిల్లు, విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను అన్నీ చెల్లిస్తున్నారు. అయినా ఆ ఊరు రెవెన్యూ రికార్డుల్లో లేదు. మూడు దశాబ్ధాల కింద పూరిళ్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత పక్కా ఇళ్లూ వెలిశాయి. అయినా మీది కాదు పొమ్మంటున్నారు. ఊరు మొత్తాన్నీ కొనుగోలు చేశాం.. ఖాళీ చేయకుంటే ఇబ్బందులు పడుతారంటున్నారు. ఉనికి ప్రశ్నార్థకంగా మారిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బూరుగిద్ద గ్రామం పరిస్థితి ఇది. సాదాబైనామాలో కొనుగోలు చేసిన భూమిని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు ఖాళీ చేయలని చెబుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

man-sale
man-sale
author img

By

Published : Dec 22, 2020, 3:29 PM IST

తెలంగాణ కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని బూరుగిద్ద హామ్లెట్ గ్రామం. 1972లో లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కామారెడ్డి - ఎల్లారెడ్డి రహదారి పక్కన ఒక ఫాదర్ చర్చిని నిర్మించారు.

13 కుటుంబాల వ్యథ

నల్లగొండ జిల్లా నుంచి మూడు దశాబ్దాల కిందట 13 కుటుంబాలు వచ్చి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అప్పట్లో చర్చి ఆలనా పాలనా చూసే మారయ్య అనే ఫాదర్ ఈ నిరుపేదలకు ఇల్లు కట్టించాలని భావించాడు. లింగంపల్లి గ్రామానికి చెందిన పిట్ల కాశయ్య నుంచి చర్చి పక్కనే గల సర్వే నంబర్ 311 లో 29గుంటల భూమి కొన్నాడు. రూ. వెయ్యికి కొనుగోలు చేసి తెల్ల కాగితంపై రాసుకున్నారు. ఆ భూమిలో 1987లో పదమూడు కుటుంబాలకు పెంకుటిల్లు కట్టించారు. అప్పటి నుంచి వీరు గ్రామపంచాయతీలో ఇంటి టాక్స్ కడుతూనే ఉన్నారు. జోసెఫ్ ఫాదర్ క్రిస్టియన్ మిషన్ నుంచి రూ.45 వేలు, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.18 వేలు ప్రభుత్వం నుంచి రుణం తీసుకుని 1998లో పక్కా భవనాలను నిర్మించి ఇచ్చారు.

మేము ఎక్కడికి పోవాలి?

ప్రస్తుతం బూరిగిద్ద గ్రామం హామ్లెట్ ఎల్లమ్మ తండా గ్రామ పరిధిలో ఉంది. చర్చికి సమీపంలో సర్వేనెంబర్ 336లో ఓ వ్యక్తికి 14 గంటల భూమి ఉంది. ప్రస్తుతం అక్కడ 13 కుటుంబాలు నివాసముంటున్నాయి. సర్వేనెంబర్ 311 లోని 29 గుంటల భూమిని 2014లో ఆ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 29 గుంటల భూమిని విక్రయించాడు. లింగంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి రెండు రోజులుగా బూరుగిద్ద గ్రామానికి వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని స్థానికులను చెబుతున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న భూమిని ఎలా ఖాళీ చేస్తామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉండదు?

గ్రామస్థులు అధికారులను కలిసి అడిగితే రెవెన్యూ రికార్డుల్లో గ్రామం లేదని చెబుతున్నారు. ఇళ్లు ఉన్న ప్రాంతం రికార్డుల్లో పట్టా భూమిగా ఉందని చెబుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి కొనుగోలు చేసి ఇళ్లు కట్టించిన పిట్ల కాశయ్య చనిపోయినా.. ఆయన వారసులు భూమిని ఎవరికీ అమ్మలేదని అలాంటప్పుడు వారికి తెలియకుండా రిజిష్ట్రేషన్ ఎలా చేస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా ఇంటి పన్ను, నల్లా, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని.. అన్ని రికార్డుల్లో బూరుగిద్ద గ్రామం ఉన్నప్పుడు.. రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉండదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేశామంటూ కొందరు వ్యక్తులు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని చెబుతున్నారని.. ఎక్కడికి వెళ్లాలని గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం న్యాయం చేస్తామని చెబుతున్నారు.

ఉన్నత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.