తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. జోడి దేవాజీ అనే వ్యక్తి సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి, దానిని తన ఛాతిపై పెట్టుకొని పడుకున్నాడు. ప్రమాదవశాత్తు సెల్ఫోన్ ఛార్జర్ ద్వారా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో సెల్ఫోన్ పూర్తిగా కాలిపోయింది. మృతుడికి భార్య ఉంది. మద్దెల రవి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 14 నెలలుగా దేవాజీ పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి