ETV Bharat / city

తెలంగాణ: ఆన్​లైన్​ లోన్​ వేధింపులకు మరో ప్రాణం బలి

తెలంగాణ రాష్ట్రం మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్​లైన్​ లోన్​ వేధింపులు భరించలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు వాపోయారు.

man-commits-suicide
ఆన్​లైన్​ లోన్​ వేధింపులకు మరో ప్రాణం బలి
author img

By

Published : Dec 3, 2020, 8:34 PM IST

ఆన్​లైన్​ లోన్​ వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణానికి చెందిన శ్రావణ్​ అనే యువకుడు ఆన్​లైన్​ ద్వారా రూ.16వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లింపులో ఆలస్యమవడం వల్ల ఆ సంస్థ ప్రతినిధులు పలుమార్లు అడిగారు. నోటీసులు పంపడమేగాక వాట్సాప్​ ద్వారా ఒత్తిడి చేశారు.

బంధువులకు సైతం ఫోన్​ చేసి... అప్పు గురించి చెప్పారు. అవమానంగా భావించిన శ్రావణ్​ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ పరిస్థితి మరొకరికి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

ముంచుకొస్తున్న బురేవి- విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.