ETV Bharat / city

Maha Padayatra:వెల్లువెత్తిన ప్రజామద్దతు..పాదయాత్రలో ఉద్రిక్తత - అమరావతి రైతుల మహాపాదయాత్ర

అమరావతి స్వరం, రైతు ఘోష, పిల్లల భవిష్యత్తు... ఈ నినాదాలు నలుమూలలా వినిపించేలా రాజధాని రైతులు ప్రకాశం జిల్లాలోకి కదిలారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలన్న వారి ఆకాంక్షకు జనం గొంతు కలిసింది. పాదయాత్ర చేసినవారు పీఠాలు ఎక్కినట్లే.. తామూ రాజధాని సాధించుకుంటామని ఆరో రోజు పాదయాత్రలో తేల్చిచెప్పారు.

అమరావతి రైతుల మహాపాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్ర
author img

By

Published : Nov 6, 2021, 10:14 PM IST

Updated : Nov 7, 2021, 4:27 AM IST

ఉత్సాహంగా సాగిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఆరో రోజైన శనివారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కొవిడ్‌, ఇతర నిబంధనలు పాటించలేదంటూ పాదయాత్రికులకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందజేశారు. కళాకారుల వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఉదయం 9 గంటలకు మొదలైన యాత్ర 8 కి.మీ. కొనసాగి పర్చూరు నియోజకవర్గం చిననందిపాడు వద్ద ప్రకాశం జిల్లాలోకి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించి, 10 కి.మీ. సాగింది. రెండు జిల్లాల నుంచి ప్రజలు, రైతులు, న్యాయవాదులు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో చిననందిపాడు నుంచి అడుసుమల్లి వరకు దాదాపు 5 కి.మీ. వరకు ట్రాఫిక్‌ నిలిచింది. రాకపోకలను నియంత్రించాల్సిన పోలీసులు... వాహనాలను ఫొటోలు తీయడానికి, డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించడానికి, మఫ్టీలో నిఘా పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని రైతులు అసంతృప్తి వ్యక్తంచేశారు.

వైజంక్షన్‌లో హైడ్రామా...
పర్చూరు వైజంక్షన్‌లో శనివారం సాయంత్రం కొంతసేపు హైడ్రామా నెలకొంది. మఫ్టీలో ఉండి ఫొటోలు తీస్తున్న యద్దనపూడి కానిస్టేబుల్‌ కె.చంద్రానాయక్‌కు, యాత్రలో పాల్గొన్న ప్రజలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాంతో కానిస్టేబుల్‌ చేతికి స్వల్ప గాయమైంది. అయిదుగురు వ్యక్తులు దాడి చేసి, తనను గాయపరిచారని ఆయన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పర్చూరు ఎస్సై రమణయ్య తెలిపారు.

ప్రకాశం జిల్లా చిననందిపాడులో భారీ సంఖ్యలో హాజరైన రైతులు, వివిధ సంఘాల ప్రతినిధులు

తెలంగాణ రైతుల సంఘీభావం
తెలంగాణలోని నల్గొండ రైతు సంఘం నాయకులు పాదయాత్రకు సంఘీభావం తెలిపి, రూ.లక్ష విరాళం అందించారు. యాత్రలో కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు.. పర్చూరు, కొండపి శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, తెదేపా నాయకులు దామచర్ల జనార్దన్‌, వంగలపూడి అనిత, శ్రీరామ్‌ మాల్యాద్రి, వి.నరేంద్రవర్మ, నూకసాని బాలాజీ, ముప్పాళ్ల నాగేశ్వరరావు(సీపీఐ), కుమారస్వామి(భారతీయ కిసాన్‌ సమితి) తదితరులు పాల్గొన్నారు.

రూ.20 లక్షల విరాళాలు
పాదయాత్రకు శనివారం రూ.20 లక్షల వరకు విరాళాలు అందాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.5లక్షలు ఇచ్చారు. అనంతవరం, ఉప్పుటూరు, మిర్యాలగూడ, సత్తినపల్లి, గుడిపూడి, గన్నవరం గ్రామస్థులు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఐకాస నేతలకు రూ.4,76,116 అందజేశారు.

నిర్వాహకులకు సంజాయిషీ నోటీసులు
హైకోర్టు ఆదేశాలు, డీజీపీˆ ఉత్తర్వులు ఉల్లంఘించారంటూ పాదయాత్ర నిర్వాహకులకు పోలీసులు తాఖీదులు జారీ చేశారు. పర్చూరు బొమ్మల కూడలికి యాత్ర చేరుకోగానే చీరాల ఎస్డీపీవో పేరుతో మైకులో ప్రకటన చేశారు. కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించారని, బాణసంచా పేల్చారని, 157 మందికి అనుమతివ్వగా వేల సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఈ మేరకు నిర్వాహకులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజ, మల్లికార్జునరావు పేరిట... డీఎస్పీలు శ్రీకాంత్‌, నాగరాజు తదితరులు వచ్చి తాఖీదులు అందజేశారు. వారంలో సంజాయిషీ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే... నోటీసులిచ్చేందుకు వచ్చిన డీఎస్పీ నాగరాజు మాస్కును కిందకు జారవిడవగా, చీరాల సీఐ రోశయ్య మాస్కు ధరించకపోవడం గమనార్హం. పాదయాత్రలో వినియోగించిన కళాకారుల వాహనాన్ని సైతం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ప్రశ్నించడంతో అప్పటికప్పుడు నోటీసులిచ్చారు. పోలీసు యాక్టు 30 అమలులో ఉన్నప్పటికీ రెండు బాక్సుల ద్వారా అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Amaravathi Farmers: ప్రభంజనంలా మహాపాదయాత్ర.. ప్రకాశం జిల్లాలోకి ప్రవేశం

Last Updated : Nov 7, 2021, 4:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.