ETV Bharat / city

TDP Mahaanadu: మహానాడులో తొలిరోజు 6 తీర్మానాలు ఆమోదం - mahanadu conclusion day 1

తెదేపా మహానాడు(TDP Mahaanadu)లో తొలిరోజు ఆరు తీర్మానాలను ఆమోదించింది. వీటిలో రాష్ట్రానికి చెందినవి నాలుగు కాగా, తెలంగాణకు చెందినవి 2 ఉన్నాయి. తొలి తీర్మానాన్ని శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రవేశపెట్టగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, శాసనసభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి బలపరిచారు.

tdp mahanadu
tdp mahanadu
author img

By

Published : May 27, 2021, 10:00 PM IST

Updated : May 27, 2021, 10:31 PM IST

తొలిరోజు మహానాడు(TDP Mahaanadu)లో తెదేపా ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించింది. వీటిలో రాష్ట్రానికి సంబంధించి 4 కాగా , తెలంగాణవి 2 ఉన్నాయి. ప్రతి తీర్మానంపై ఒక నేత మాట్లాడితే మరో ముగ్గురు నేతలు బలపరిచారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రతి తీర్మానానికి ముగింపు సందేశం ఇస్తూ ఆమోదం తెలిపారు.

  • "రాష్ట్రంలో కొవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు- తలకిందులైన కుటుంబ ఆదాయం" అంశంపై తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయడు ప్రవేశపెట్టిన తొలి తీర్మానాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, శాసనసభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి బలపరిచారు.
  • "రాష్ట్ర ఉగ్రవాదం-న్యాయ ఉల్లంఘన-ప్రజాస్వామ్యం వెనుకంజ" అంశంపై దీపక్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గౌతు శిరీష, ఎంఎస్ రాజు, జవహర్ లు బలపరిచారు.
  • "అదుపులేని ధరలు- పెంచిన పన్నులు-అప్పులు" అంశంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్, మహ్మద్ నజీర్ బలపరిచారు.
  • "పరిశ్రమలపై దాడులు- అమరావతి సంపద విధ్వంసం- పెరుగుతున్న నిరుద్యోగం" అంశంపై బీద రవిచంద్ర యాదవ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బలపరిచారు.
  • తెలంగాణకు సంబంధించిన "వ్యవసాయ సంక్షోభం - సమస్యల సుడిలో అన్నదాత" అనే అంశంపై తీర్మానాన్ని నెల్లూరు దుర్గా ప్రసాద్ ప్రవేశపెట్టారు. జ్యోజిరెడ్డి, కాపా కృష్ణమోహన్ దీనిని బలపరిచారు.
  • అరవింద కుమార్ గౌడ ప్రవేశపెట్టిన "సంక్షేమానికి కోతలు-మారని బడుగు, బలహీన వర్గాల తలరాతలు" అంశంపై తీర్మానాన్ని తాజుద్దీన్, అశోక్ లు బలపరిచారు.

ఇదీ చదవండి: Mahanadu-2021: ప్రతీ కుటుంబంపై రూ.2.50లక్షల భారం మోపారు: చంద్రబాబు

Last Updated : May 27, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.