ETV Bharat / city

తెలంగాణ: అందుబాటులోకి ఎల్​వీపీఈఐ ఓపెన్‌ సోర్స్‌ వైజర్‌

కరోనా మహమ్మారి నుంచి వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఓపెన్‌ సోర్స్‌ వైజర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్‌ శరీరం లోపలికి వెళ్లకుండా వైద్య సిబ్బందికి రక్షణ కోసం ఈ వైజర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనికి ఇతర ఆసుపత్రుల నుంచి కూడా డిమాండ్‌ రాగా.. తయారీ విధానాన్ని వైబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

lvpei-innovated
lvpei-innovated
author img

By

Published : Apr 9, 2020, 8:16 PM IST

అందుబాటులోకి ఎల్​వీపీఈఐ ఓపెన్‌ సోర్స్‌ వైజర్‌

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. వైరస్‌ శరీరంలోకి వెళ్లకుండా ఉండేందుకు మాస్కులు వాడుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా రోగుల నుంచి వచ్చే గాలి... చికిత్స అందించే వైద్య సిబ్బందికి చేరకూడదని ఆలోచనకు ప్రతిరూపమే ఈ వైజర్‌. ఇది ముఖానికి ప్లాస్టిక్‌ కవచం లాంటింది. మొత్తం ముఖాన్ని కప్పేస్తూ వైరస్​ నుంచి రక్షిస్తుందని ఇన్నోవేషన్‌ ఇంజనీర్​ సందీప్‌ తెలిపారు.

ఓపెన్‌ సోర్స్‌ వైజర్‌ అనేది రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్యులకు పూర్తి రక్షణగా ఉంటుందని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల వైద్యులు వినీత్‌జోషి అన్నారు. రోగి నుంచి వచ్చే గాలి, తుమ్ములు వారి ముఖానికి తగలకుండా ఉంటాయన్నారు. ఇది వైద్య సిబ్బందికి పూర్తి రక్షణగా ఉంటుందన్నారు.

వెబ్​సైట్లో అందుబాటులోకి..

వైద్యుల వ్యక్తిగత రక్షణ కోసం తయారు చేసిన ఓపెన్‌ సోర్స్‌ వైజర్‌కు ఇతర ఆసుపత్రి వైద్యుల నుంచి కూడా డిమాండ్‌ పెరిగింది. వైరజ్​ తయారీ అందిరికి అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో https://lvpmitra.com/osvisor అనే వైబ్‌సైట్​ను అందుబాటులో తీసుకొచ్చినట్లు ప్రాజెక్ట్‌ లీడర్‌ సందీప్‌ తెలిపారు.

దీనిని కేవలం వైద్యులకు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా వాడొచ్చని తెలిపారు. ప్రస్తుతం దీనిని తయారు చేసేందుకు రూ.90 ఖర్చు అవుతుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.