ETV Bharat / city

KCR: చేనేత వర్గాలకు వంద శాతం ఉజ్వల భవిష్యత్: కేసీఆర్​ - telangana varthalu

చేనేత వర్గాలకు వంద శాతం ఉజ్వల భవిష్యత్‌ అందించే మార్గాలు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌, సిరిసిల్లలో అపరెల్‌ పార్క్‌లతో చేనేత జీవన ముఖచిత్రం మారుతుందనే విశ్వాసం ప్రకటించారు. తెలంగాణ తెదేపా మాజీ అధ్యక్షుడు ఎల్​.రమణకు గులాబీ కండువా కప్పి లాంఛనంగా తెరాసలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో చేనేత వాణి వినిపించేలా.. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో త్వరలోనే శుభవార్త చెబుతామని కేసీఆర్​ వెల్లడించారు.

l.ramana joined in trs in the presence of cm kcr
'చేనేత వర్గాలకు వంద శాతం ఉజ్వల భవిష్యత్​ అందిస్తా'
author img

By

Published : Jul 16, 2021, 7:21 PM IST

తెలంగాణ భవన్​లో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ సమక్షంలో తెతెదేపా మాజీ అధ్యక్షుడు ఎల్​.రమణ తెరాస పార్టీలో చేరారు. ఎల్​.రమణతో పాటు పలువురు నేతలకు తెలంగాణ భవన్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గులాబీ కండువా వేసి తెరాసలోకి ఆహ్వానించారు. తెరాసలోకి ఎల్‌.రమణకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని కేసీఆర్​ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించడానికే ఎల్‌.రమణ పార్టీలో చేరారన్నారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. చేనేత సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఎవరు చనిపోయినా రైతు బీమాలాగా బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్ల పర్యటనలో ఇది ఇప్పటికే చెప్పామని గుర్తుచేశారు.

అద్భుత పథకాలు అమలు చేశాం..

తెరాస పథకాలు ప్రతి గ్రామంలో ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు అవకాశం ఇచ్చారని.. చిన్న తప్పు దొర్లితే కొన్ని తరాలకు దెబ్బకొడుతుందన్నారు. అజెండా ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి ముందుకెళ్తున్నామని కేసీఆర్​ స్పష్టం చేశారు. నీటిపారుదలలో నేరపూరిత నిర్లక్ష్యంతో రాష్ట్రానికి నష్టం జరిగిందని.. తెలంగాణ పునర్నిర్మాణం అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మిషన్‌ కాకతీయ వంటి అద్భుత పథకాలు అమలు చేశామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకే..

వరంగల్‌ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు సూరత్‌లో ఉన్నారని... వారి సమస్యలపై అక్కడకు అధికారులను పంపామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమను ప్రోత్సహిస్తే తిరిగివస్తామని వారు చెప్పారని తెలిపారు. వరంగల్‌లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేశామని... ఇటీవలే జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు. వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌, సిరిసిల్లలో అపారెల్‌ పార్క్‌లతో చేనేత జీవన ముఖచిత్రం మారుతుందనే విశ్వాసం ప్రకటించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ ఏర్పాటైతే ధనిక రాష్ట్రంగా మారుతామని చెప్పామని... ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే మంచి జీతాలు అందుకుంటున్నారని కేసీఆర్​ పేర్కొన్నారు. నిన్న 40 ఎకరాలు అమ్మితే రూ.2 వేల కోట్లు వచ్చాయని... ఆ ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తామని వెల్లడించారు. చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకు కృషి చేస్తున్నామన్నారు.

అగ్రస్థానంలో తెలంగాణ

తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. తెలంగాణ స్వప్నం సాకారం కోసం విశ్రమించనని... తెలంగాణ స్వప్నం సాకారానికి ప్రజల దీవెన, సహకారం కావాలన్నారు. చేనేతకు రాజకీయ ప్రాతినిధ్యం కోసం త్వరలో శుభవార్త చెబుతానని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు.

శాశ్వత పరిష్కారం..

చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి గతంలో అనేకసార్లు కళ్లలో నీళ్లు తిరిగేవి. సిరిసిల్ల కలెక్టర్‌ ఆత్మహత్యలు చేసుకోవద్దని గోడలపై రాయించారు. వారి బాధలు పోవాలని అనుకున్నాను. భూదాన్‌పోచంపల్లిలో ఒకేరోజు ఆరుగురు ఆత్మహత్య చేసుకుంటే జోలెపట్టి సాయం చేశాం. ఇప్పుడు కొద్దిపాటి చర్యలతో ఉపశమనం లభించింది. శాశ్వత పరిష్కారం జరగాల్సి ఉంది. అందుకు శాయశక్తులా కృషి చేస్తా. -తెలంగాణ సీఎం కేసీఆర్​

ప్రత్యామ్నాయం లేదు..

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదని మంత్రి గంగుల కమలాకర్​ వెల్లడించారు. తెరాస.. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ఎల్‌.రమణ పార్టీలో చేరారని మంత్రి గంగుల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Ministry of Jal Shakti: విభజన చట్టం ప్రకారమే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా: జల్‌శక్తి శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.