ETV Bharat / city

గ్రేటర్​ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...! - ghmc polling

హైదరాబాద్ నగరవాసుల బాధ్యతారాహిత్యం మరోసారి బట్టబయలవుతోంది. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే సువర్ణావకాశాన్ని బద్ధకమనే ముసుగుతో కప్పేసి... మురికి కాలువల్లో పడేస్తున్నారు. "మాకెందుకొచ్చిన కష్టం మా పని మేం చేసుకుంటాం" అంటూ... వజ్రాయుధంగా చెప్పుకునే ఓటు హక్కును నగరవాసులు అపహాస్యం చేస్తున్నారు.

low-voting-percentage-in-ghmc-elections
గ్రేటర్​ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!
author img

By

Published : Dec 1, 2020, 4:36 PM IST

చరిత్ర పునరావృతం అవుతోంది. ఎప్పటిలాగే హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఒంటిగంట వరకు ఒక్కశాతం కూడా పోలింగ్ నమోదు అవని డివిజన్లు ఉన్నాయంటే పోలింగ్ పట్ల ఎంత అనాసక్తి ఉందో తెలుస్తోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావటం, కొంత కరోనా భయం... వెరసి పోలింగ్‌పై ప్రభావం చూపిస్తోంది.

ఈసారైనా.. ప్రజలను ఓటింగ్‌కి రప్పించేందుకు ఎన్నికల సంఘం, జీహెచ్​ఎంసీ విస్తృత ప్రచారం చేశాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ వంతు అవగాహన కల్పించారు. అటు ప్రజాప్రతినిధులు సైతం ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని మైకులరిగేలా మొత్తుకున్నా... నగరవాసుల బద్దకాన్ని ఏ మాత్రం కదిలించలేవనే చెప్పాలి. కొన్ని చోట్లు ముసలివాళ్లు, వికలాంగులు సైతం పడుతూ లేస్తూ... వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటే... మరికొన్ని చోట్ల మాత్రం మాకేందుకులే అన్నట్లు వారి పని వారు చేసుకుపోతున్నారు.

కొన్ని స్థానాల్లో యువత మెరిసినా... చెప్పుకోదగ్గ ఫలితం మాత్రం కనిపించకపోవటం బాధాకరం. కనీసం ఈసారైనా ఓటింగ్ శాతం 50 దాటుతుందని అందరూ ఆశించినా... నగరవాసుల బద్ధకం వారి ఆశలను మూసిలో కలిపేస్తోంది. సాయంత్రం 6.00 గంటల వరకు వేచిచూస్తే గానీ... నగరవాసులు ఎంత బాధ్యతతో ఉన్నారో తేలనుంది.

ఇదీ చూడండి: ఉపాధి మార్గం.. తితిదే శిల్ప కళాశాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.