తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపింది. ఆదివారం సాయంత్రంలోగా వాయుగుండం తీరం దాటే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి వాయుగుండం తీరం దాటే సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల