వాయువ్య బంగాళా ఖాతంలో.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్ తీరంలోని దిఘాకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల ద్రోణి అత్యంత క్రియాశీలకంగా మారిందని.. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించారు.
weather బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంలో వర్షాలు
బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్ తీరంలోని దిఘాకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.