విద్యాలయాలను కుల రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సామాజికవర్గ కోణంలో... ఎస్వీయూలో టీచింగ్ అసిస్టెంట్లను తొలగించారని ఆరోపించారు. తమ స్వార్థం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తారా అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు. అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతు చూస్తామంటూ విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తారా అని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే హక్కును కాలరాస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని అయన హెచ్చరించారు.
ఇవీ చూడండి-"వైకాపా పాలనలోనే 17 పరిశ్రమలు తరలిపోయాయి"