గాలి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఫేక్ పార్టీకి.. ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా ప్రజలు స్థానిక ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని నారా లోకేశ్ అన్నారు. జగన్ రెడ్డి ఇంట్లో పుట్టిన వైకాపాకు... జనం గుండెల్లోంచి పుట్టిన తెదేపాకు పోలికేంటని ధ్వజమెత్తారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జనంలో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని.. జగన్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థలపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. న్యాయస్థానాల చొరవతో స్థానిక ఎన్నికలు జరిగాయన్నారు.
అధికారులు, పోలీసులను వాడుకొని.. వైకాపా వాళ్లు హత్యలు చేసి, కిడ్నాప్లకు పాల్పడ్డారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలు చించేసి... ఆస్తులు తగులబెట్టి, ప్రలోభాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇన్ని చేసినా ఎదురొడ్డి నిలిచి.. గెలిచిన తెలుగుదేశం యోధులకు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం సంతోషంగా ఉంది: నిమ్మగడ్డ