ETV Bharat / city

'జగన్​ను చూసి పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు'

సీఎం జగన్​ను చూసి రాష్ట్రంలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ అభివృద్ధి దిశగా సాగితే.. జగన్ రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేశారని మండిపడ్డారు.

Lokesh on Foreign Investments
Lokesh on Foreign Investments
author img

By

Published : Sep 3, 2021, 11:19 AM IST

ముఖ్యమంత్రి జగన్​రెడ్డి ముఖం చూసి, రాష్ట్రంలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టట్లేదనటానికి కేంద్ర నివేదికలే నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి.. రాష్ట్రాన్ని మొదటి 5 స్థానాల్లో నిలుపుతూ వచ్చారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి దరిద్ర పాదానికి, అరాచకం తోడయ్యి, ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో, 13వ స్థానానికి పడిపోయామని మండిపడ్డారు. మన పక్కన రాష్ట్రాలన్నీ, ఉన్నత స్థానంలోకి చేరుతుంటే, మన రాష్ట్రం దిగజారిపోతోందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: CORONA CASES IN SCHOOLS: ముసునూరు జడ్పీ హైస్కూల్​లో కరోనా కలకలం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.