వైకాపా ప్రభుత్వం కరోనా పరీక్షల నుంచి వైద్యం వరకూ అన్నీ అబద్ధాలే చెబుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కరోనా పెద్ద విషయం కాదన్న రోజు నుంచి అదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం అశోక్నగర్కి చెందిన భవానీ శంకర్ కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని చెప్పి ఇంటికి పంపారని.., వస్తుందన్న అంబులెన్స్ అడ్రెస్ లేకుండా పోయిందని.. వారిని పట్టించుకున్న నాధుడు లేడని దుయ్యబట్టారు. రెండు రోజులుగా కుటుంబం పడుతున్న ఆవేదన వర్ణణాతీతమని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకి ఆసుపత్రుల్లో బెడ్స్ లేవంటూ గాలికొదిలేస్తున్న సీఎం జగన్ అధికార పార్టీ ఎమ్మెల్యేకు, నాయకులకు హైదరాబాద్ లో అధునాతన వైద్యం అందిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'