మాస్క్ అడిగిన డాక్టర్‌ని సస్పెండ్ చెయ్యడం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే డాక్టర్లూ కరోనా బారిన పడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకిందంటే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటని లోకేశ్ ప్రశ్నించారు. కరోనా నివారణకు పోరాడుతున్న డాక్టర్లకు.. మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలనే డాక్టర్లకు కరోనా సోకిందని ఆరోపించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా నమోదు కాని కరోనా కేసులు