రాజధాని కోసం 29 వేల 881 మంది రైతులు 34వేల 322 ఎకరాలు ఇచ్చారని... అందులో ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్న రైతులు 20,490 మంది ఉన్నారని... ఒకటి నుంచి 2 ఎకరాలకు మధ్య ఉన్నవారు 5,227 మంది ఉన్నారని నారా లోకేశ్ తెలిపారు. కేవలం 159 మందికి మాత్రమే 10 ఎకరాలకు మించి భూమి ఉందన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడింది ఈ పేద రైతులేనని వైకాపా చెబుతోందని ధ్వజమెత్తారు. పేదరికానికి కులం కూడా ఉంటుందా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు.
ఇదీ చదవండి: దమ్ముంటే కేబినెట్ భేటీ అమరావతిలో పెట్టండి: దేవినేని ఉమ