ETV Bharat / city

'రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం' - లోకేశ్ తాజా వార్తలు

పోలవరం అంచనాలు ఎందుకు తగ్గాయో సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్‌ చేశారు. కేంద్ర పెద్దల్ని ఎందుకు కలుస్తున్నారో సీఎం ఎన్నడైనా ప్రజలకు చెప్పారా అని ప్రశ్నించారు. వైకాపా ఎంపీలు ట్వీట్లతో కాలక్షేపం చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని హితవు పలికారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకూ పర్యటించిన లోకేశ్‌ వరదలొచ్చి 15రోజులు దాటినా ముంపు బాధితులకు ఇంకా నిత్యావసరాలు పంపిణీ చేయలేదని ఆక్షేపించారు. రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం సిద్ధమని స్పష్టంచేశారు.

Lokesh
Lokesh
author img

By

Published : Oct 27, 2020, 4:53 AM IST

'రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. పోలవరం, స్థానిక ఎన్నికలు, వరద బాధితుల సాయంపై మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర పెద్దల్ని కలుస్తున్న సీఎం జగన్​...ఎందుకు కలుస్తున్నారో ఎప్పుడైనా ప్రజలకు చెప్పారా అని ప్రశ్నించారు. పోలవరం అంచనాలు ఎందుకు తగ్గాయో..సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏకగ్రీవాలు సాధ్యం కావనే

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. కొన్ని జిల్లాల్లో..అభ్యర్థులను ప్రలోభ పెట్టి, దౌర్జన్యం చేసి ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏకగ్రీవాలు సాధ్యం కాదనే ఉద్దేశంతో ఎన్నికలను జరపడానికి వెనక్కి తగ్గుతున్నారన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపా పోటీకి సిద్ధంగా ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.

రాత్రి వరకూ సాగిన పర్యటన

తణుకు నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన...సోమవారం రాత్రి పదిన్నర గంటల వరకూ కొనసాగింది. ఫ్లడ్​ లైట్​ వెలుగులతో వరద ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో ప్రారంభమైన లోకేశ్ పర్యటన.. అక్కడ నుంచి కొమ్మర ఉరదాళ్ళపాలెం, తిరుపతిపురం ఒరిగేడు మీదుగా దువ్వ వరకు కొనసాగింది. పర్యటన ఆద్యంతం ముంపు బారిన పడిన పంట పొలాలను, నివాస ప్రాంతాలను పరిశీలించి బాధితులను ఓదార్చారు. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని భరోసా కల్పించారు.

15 రోజులైనా నిత్యావసరాలు అందలేదు

తెదేపా హయాంలో వరదల వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి ప్రజలకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ముందుగానే అందించామన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చి 15 రోజులు గడిచినా బాధితులకు నిత్యవసర వస్తువులు అందించలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు గురించి గానీ పోలవరం అంచనాలు తగ్గినప్పుడు గానీ లేఖలు రాయని ఎంపీ ఒక సంస్థ గురించి మాత్రం లేఖ రాస్తారని విమర్శించారు.

ఆ శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపండి

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం ద్వారా ప్రతిపక్షం లేకుండా చేయలేన్నది జగన్ ప్రభుత్వ ఆలోచనని లోకేశ్ ఆరోపించారు. తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి చూపించే శ్రద్ధను ప్రజా సమస్యలపై చూపించాలని ఆయన హితవు పలికారు. ఈ పర్యటనలో తెదేపా నేతలు అరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, ముళ్ళపూడి బాపిరాజు, మాజీ మంత్రి జవహర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ట్రాక్టర్​ నిర్లక్ష్యంగా నడిపారని లోకేశ్‌పై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.