కరోనా నేపథ్యంలో సహాయంగా ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులకు ఇచ్చిన పురుగు పట్టిన బియ్యం, నాణ్యత లేని వంట నూనె ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందు వరుసలో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం అవమానించడం తగదని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలన్నారు. జర్నలిస్టులకు వ్యక్తిగత రక్షణ కిట్లు, 50 లక్షల బీమా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :