పోటీ చేసి గెలిచే దమ్ము లేక సీఎం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాక్షస రాజ్యంలో నామినేషన్ వేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులను జగన్ వైకాపా నాయకుల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. తెదేపా అభ్యర్థులపై అక్రమ కేసులు పెడుతున్నారనీ.. నామినేషన్ పత్రాలు చించేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలను ఏకపక్షం చేసుకునేందుకు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారులే నామినేషన్ వేసే హక్కుని హరిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ట్విటర్ ద్వారా నిలదీశారు.
ఇవీ చదవండి:
మా అభ్యర్థుల నామపత్రాలు చించేస్తుంటే.. పోలీసులు స్పందించరా?'